top of page
  • Facebook
  • Twitter
  • Instagram

D E S C R I P T I O N

సత్రాజిత్తు మానవునిలోని దురహంకారానికి
, దురుసుతనానికి, స్వార్థం సంకీర్ణ వ్యక్తినిష్ఠకూ ప్రతీకంగా నిలుస్తాడు. అతని అహంకారానికి రెండు మణులు కారణాలయ్యాయి. ఒకటి శ్యమంతకమణి, ఆ మణి నెపాన, బంగారు రజనను అమాయక భల్లూక ప్రజ నుండి కొల్లగొట్టి యాదవులలో సర్వశ్రేష్ఠునిగా తనను నిలుపుకోదలచడమే గాక, అశ్వమేథయాగాన్ని చేసి తన సార్వభౌమశక్తిని పృథ్వి ఎడదలో ప్రతిష్ఠించుకో కలలు కనిన అమితాశాపరుడు. ఆ శ్యమంతకం నుండి వేరైతేనే కాని అతని మార్పు ప్రారంభం కాదు. మరో మణి సత్యభామామణి. పరమసౌందర్య, లావణ్యరాసిగా, దర్పగర్వాలనేకాక, తండ్రి సంపాదించిన వైభవాన్ని ప్రదర్శించి, శ్రీ కృష్ణుణ్ణి వశపరచుకోవాలని ప్రయత్నించిన యువతి. ఆమె సచ్ఛీల, అనురాగజీవి, పరమసాహసి – ఈ గుణాలతో శ్రీ కృష్ణుని వెంట నడవాలంటే తన దర్ప, గర్వాలను, వైభవప్రాగల్భ్యాలను తృణీకరించి పరమపురుషునికి అకించనురాలిగా తనను అర్పణ చేసుకుంటేనే, తామస ప్రేమ నుండి, సాత్విక సమర్పణ దాకా ఎదిగితేనే ధన్యజీవి కాగలుగుతుంది. ఊహల అల్లిక గాథ – ‘సత్యభామ’

సత్యభామ

$10.00Price
Quantity
Product Release Period :: January'2026

Author:             భండారు సదాశివరావు
Language:         Telugu
Pages:              180
Topics:              26

bottom of page