top of page
  • Facebook
  • Twitter
  • Instagram

భండారు సదాశివరావు

Author of the best-selling books Life for Rent, The Sleepwalkers, 
Infinity Expired and many more

Bhandaru_Sadasiava_Rao.jpg

అఖిల భారతీయ సాహిత్యోద్యమ రథసారధి

CLASSICS

ఒక అలౌకిక మహావిభూతి పుట్టడానికి సహేతుకమైన కారణం ఉండాలి. పృథ్వీ శ్రీమన్నారాయణుని వద్దకు వచ్చి తననుద్ధరించమని వేడుకుంటుంది. ఆయన ఎప్పుడు పుట్టినా ధర్మరక్షణకే. ఇనుప సంకెళ్ళలో మ్రగ్గుతున్న ఆ తల్లి దేవకీ గర్భాన కారాగారంలో పుట్టడంతో సరిపోలేదు. ఎందరెందరు ఆయన రాకకు ఎదురుచూచారో. అర్ధరాత్రి, చీకటిలో, ఉరుములు మెరుపుల మధ్య వర్షంలో పురిటి గ్రుడ్డును - నీలమేఘశ్యాముని యమునను దాటించడం, ప్రజలను కష్టాల కడలి నుండి దాటించడమే. ఆ తరువాత ఆయన పెరుగుదల, ఆయన వేణుగాన సుధా మధురిమలు, కంస ప్రేరితమైన దాడులను త్రిప్పికొట్టి రాధా మనోహరుడై, గోపగోపీజన  వల్లభుడై, యశోదానందుల ఆనందనిధానుడై, చివరికి కంసవధతో తన జీవన కార్యాన్ని ప్రారంభించిన కృష్ణ కథ చరాచరాలను ముగ్ధమొనరించిన 'మోహన మురళి'

ఒకవైపు తన అల్లుడైన కంసుణ్ణి సంహరించాడనే కోపంతో మరోవైపు తన సామ్రాజ్య విస్తరణకు అడ్డుపడతాడనే భయంతో జరాసంధుడు మధురపై దాడి చేస్తే, మధురను రక్షించడానికి, పారుబోతు అని లోకం అపహసిస్తుందనే లేకుండా, సహ్యాద్రికి పారిపోయి తన వలయంలోకి జరాసంధుని రప్పించుకొని, పరాభవించి పంపడం కృష్ణబలరాములకే సాధ్యం – సృగాలవ వాసుదేవ వధ, ఆర్షధర్మ సంప్రదాయాలకు విరుద్దంగా రాచకన్నెలను రాజకీయ కుట్రలకు బిచేసే దుష్టవ్యూహాలను ఛేదించడం, విదేశీ రాక్షస మూకను తీసుకొని కాలయవనుడొక వైపు నుంచి వస్తుంటే, రెండోవైపు మధురా నాశనానికి జరాసంధుడు పూనుకుంటే, తన ప్రజలను మధుర నుండి పశ్చిమసముద్ర తటానికి – ద్వారకకు వలస నడిపించడం – తనను పారుబోతు అన్నా తన పరువుకన్నా, ధర్మరక్షణ, ప్రజారక్షణ మిన్న అనే భావంతో ఎదిరించి చివరకు రుక్మిణిని గాంధర్వవిధిని వివాహమాడడం, కర్తవ్యమే ధర్మం, కష్టనష్టాలు కాదు, బాధలు కాదు – “కురుకర్మ” అని సందేశమిచ్చే భాగం ఈ “రుక్మిణీహరణం”.

ధర్మాధర్మ నిర్ణయం ధార్మికంగా జీవించి నేర్చినప్పుడే సంభవం. సాధారణ ప్రజ మహాత్ముల అడుగుజాడలను వెతుక్కుంటారు. ద్వాపరాంతంలో ధర్మం వికృతి పాలైంది. ఒక్క వ్యాక్తి సరిచేయతగ్గ పరిస్థితి కాదు. వ్యాస, కృష్ణులు ధర్మస్థాపనకు కటిబద్ధులైనారు. వారిద్దరికీ ఉపకరణాలు కావాలి. ఒక మహా వంశపరంపరను కాపాడడానికీ నియోగపద్ధతిలో జన్నించిన పాండవులు ఆ ఉపకరణాలు. వారిని రూపుమాపి, తనకే కురురాజ్యాన్ని దక్కించుకోవాలని, ధృతరాష్ట్ర, శకుని, దుశ్శాసన, కర్ణప్రభృతుల సహాయంతో చేసిన కుట్రలకు బలికాకుండా బైటపడడానికి కారణమై, నాటి సాధు శక్తుల సమీకరణకు పూనుకొని పాంచాల నరేశుడు ద్రుపదుని కూతురు ద్రౌపదీ వివాహాన్ని పంచపాండవులతో జరిపించి రాజసూయం చేయించి, నిండు సభలో శిశుపాలుని వధించి, ధర్మసంస్థాపనకు ఒక మలిమెట్టుగా పరిస్థితులను మలచిన గాధ, భీముని వృకోదరత్వ కథ చిత్రితమైన – “పంచపాండవులు”.

“I'm a review. Click to edit me and add text from a critic who has evaluated you and your work.”

Seattle Daily

Reviews

“I'm a review. Click to edit me and add text from a critic who has evaluated you and your work.”

The Washington Paper

“I'm a review. Click to edit me and add text from a critic who has evaluated you and your work.”

T.O.M Magazine

bottom of page