D E S C R I P T I O N
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, పుడమితల్లి బాధలను చూడలేక, ఆ బాధలను ఎదిరించిపోరాడగల ధీశక్తుల సాక్షాన్మూర్తిగా, సనాతన మానవధర్మసూత్రాల ప్రాతిపదికగా, నూతన సృష్టినీ, వ్యవస్థనూ నిర్మాణం చేయడానికి దేవకివసుదేవుల గర్భాన జన్మించిన శాశ్వతధర్మగోప్త శ్రీ కృష్ణుడి చరిత్ర అనుక్షణ మాననీయమై, స్మరణీయమై, అనుకరణీయమై, ప్రతివ్యక్తికీ, సమాజానికీ, బ్రాహ్మ, క్షాత్రధర్మాల సమన్వితశక్తికీ అలంబనంగా నిలిచింది. మాతృగర్భాన పడింది కారావాసంలో, చివరికి తనవు నుపసంహరించింది ఒక అల్పమానవుని అనూహ్య చర్య కారణంగా – ఈ మధ్యన ఆయన ఎదిరించిన సమస్యలు, చేసిన సాహసాలు, చేసుకున్న నిర్ణయాలు, తీర్చిదిద్దిన వ్యక్తులూ మానవజాతిచరిత్ర సంస్మరిణికల్లో శాశ్వతప్రేరకాలుగా నిలువగల మార్గదర్శకాలు. భగవద్గీత మానవధర్మ ప్రాతిపదికగా నిలవడానికి శ్రీ కృష్ణుని జీవనసాధన, కర్మయోగ పరిపాలన, ద్ధర్మ ప్రతిష్ఠాపనే కారణం. అలాంటి అనన్యప్రాప్తమైన కృష్ణకథను ఎందరో మహానుభావులు తీర్చిదిద్దారు. డా. కె. యం. మున్షీ ఆ కథనే కురుక్షేత్రంలో ఆయన ఇచ్చిన గీతాసందేశం వరకు నడుపుదామనుకున్నారు. కాని మధ్యలోనే ఆ మహానుభావుడు కన్నుమూశాడు. ఈ ‘శాశ్వత ధర్మగోప్త’ ఆ అనల్పగాథకు నేనిచ్చిన అల్పమైన జోడింపు – ఎనిమిదవభాగమనండి – ప్రత్యేకమైన గ్రంథమే ననుకోండి – స్వస్తి.
శాశ్వత ధర్మగోప్త
Author: భండారు సదాశివరావు
Language: Telugu
Pages: 326
Topics: 38


