D E S C R I P T I O N
వశిష్ఠ – శక్తి – పరాశర గోత్రపరంపరను, అనితరంగా భారతీయ ధర్మ, సంస్కృతీ, సదాచార నిష్ఠమైన జీవన ప్రణాళికగా సృష్టించి, పోషించి ప్రతిష్ఠించిన – అపరబ్రహ్మ, నారాయణాంశసంభవుడు – సాక్షాత్తు త్రినేత్రుడైన శివుడు. ఆ ముగ్గురూ ఒక్కడుగా జన్నించిన – వేదవ్యాసుడు – బాదరాయణముని, కృష్ణద్వైపాయనుడు మనకు ప్రణవస్వరూపుడైన శాస్త్ర. నేటికీ ఆయన ఆనాడు నెలకొల్పిన ధర్మతరువే, ఈ జాతికే కాక మానవాళి సార్వస్వానికి ఎదగడానికి మెట్లుకట్టిన పరమమనీషి. కురుకుల ప్రస్థాపికుడు, పరమపురుషుడైన శ్రీకృష్ణునితో శాశ్వత ధర్మగోప్తను దర్శించి, అతని కార్యసాధనకు సుక్షేత్రాన్ని సాధించిపెట్టిన మహామానవమూర్తి – మహా సాధువు – మహాముని – మహర్షి, ఆ పారాశర్యులవారి, బాల్యం నుండి పరిమళాలు వెదజల్లుతూ నిల్చిన పారిజాతంలా వికసించిన చరిత్రే ఈ - వ్యాసుడు
వ్యాసుడు
Author: భండారు సదాశివరావు
Language: Telugu
Pages: 272
Topics: 37


