D E S C R I P T I O N
ధర్మపు సుతిమెత్తని హృదయాన్ని దర్శించుకొని ధర్మంకోసం బ్రతుకుతూ, బాధలనెదిరిస్తూ, జీవనపు పలుమలుపుల్లో తననూ, తన తమ్ములనూ, ఒకే శరీరంగా, మనసుగా భావించి తమ అయిదుగురుకీ అంకితం చేసుకున్న ద్రుపద రాజదుహిత, యాజ్ఞసేని, కారణజన్మురాలైన ద్రౌపదినీ, వ్యక్తిగత ఉత్కర్షకన్నా, ధర్మసంస్ధాపనకు ఉపకరణాలుగా జీవించడమే పరమధర్మంగా గుర్తింపచేస్తూ, చివరివరకు నడిపించిన పరమోదారుడైన సంఘజీవి యుధిష్ఠిరుడు. ధర్మానికి క్షతిలేదు. చ్యుతి లేదు – అని నిరూపించ జీవించి, తన వెంటనున్నవారిని అలా జీవింపచేసిన ఆదర్శచక్రవర్తి, కురుకులాలంకారుడు, యుధిష్ఠిరుడు. సత్యాహింసల వ్యాపకార్థానికి ఆయన జీవనమొక అన్వయం – అదే మహాభారతం – శ్రీకృష్ణుని ధర్మసంస్థాపనకు కేంద్రీభూతంగా నిలిచిన మహాగాథ – యుధిష్ఠిరుడు.
యుధిష్ఠిరుడు
Author: భండారు సదాశివరావు
Language: Telugu
Pages: 193
Topics: 24


