D E S C R I P T I O N
ఒక అలౌకిక మహావిభూతి పుట్టడానికి సహేతుకమైన కారణం ఉండాలి. పృథ్వీ శ్రీమన్నారాయణుని వద్దకు వచ్చి తననుద్ధరించమని వేడుకుంటుంది. ఆయన ఎప్పుడు పుట్టినా ధర్మరక్షణకే. ఇనుప సంకెళ్ళలో మ్రగ్గుతున్న ఆ తల్లి దేవకీ గర్భాన కారాగారంలో పుట్టడంతో సరిపోలేదు. ఎందరెందరు ఆయన రాకకు ఎదురుచూచారో - అర్ధరాత్రి, చీకటిలో, ఉరుములు మెరుపుల మధ్య వర్షంలో పురిటి గ్రుడ్డును - నీలమేఘశ్యాముని యమునను దాటించడం, ప్రజలను కష్టాల కడలి నుండి దాటించడమే. ఆ తరువాత ఆయన పెరుగుదల, ఆయన వేణుగాన సుధామధురిమలు, కంస ప్రేరితమైన దాడులను త్రిప్పికొట్టి రాధా మనోహరుడై, గోపగోపీజన వల్లభుడై, యశోదానందుల ఆనందనిధానుడై, చివరికి కంస వధతో తన జీవన కార్యాన్ని ప్రారంభించిన కృష్ణ కథ చరాచరాలను ముగ్ధమొనరించిన 'మోహన మురళి'
మోహన మురళి
Author: భండారు సదాశివరావు
Language: Telugu
Pages: 217
Topics: 37


